వచ్చే ఎన్నికల్లో మహాకూటమి ప్రభావం ఎంత?.. సర్వే ప్రారంభించిన మోదీ ప్రభుత్వం

  • ‘నమో’ యాప్ ద్వారా సర్వే
  • అందరూ పాల్గొనాలని ప్రధాని పిలుపు
  • ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో వీడియో
’’మోదీ ప్రభుత్వ పాలనకు మీరు ఎన్ని మార్కులు వేస్తారు? రానున్న ఎన్నికల్లో ప్రతిపక్షాల మహాకూటమి ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీ అభిప్రాయాలు మాకు చాలా ముఖ్యం. కీలక నిర్ణయాలు తీసుకునేందుకు మీరిచ్చే సమాధానాలు ఎంతో ఉపయోగపడతాయి. ఈ సర్వేలో మీరు పాల్గొనండి. ఇతరులకూ చెప్పండి’’ అంటూ నరేంద్రమోదీ ప్రభుత్వం సరికొత్త సర్వేను ప్రారంభించింది.

రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మోదీ ‘నమో’ యాప్ ద్వారా ఈ సర్వేను చేపట్టారు. ఈ సర్వేలో బోలెడన్ని ప్రశ్నలు సంధించారు. సర్వేలో పాల్గొనాలంటూ ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో వీడియోల ద్వారా దేశ ప్రజలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. ఈ సర్వేలో వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టాలని యోచిస్తున్నారు. బీజేపీకి ప్రతికూలంగా ఉన్న చోట సిట్టింగ్‌ ఎంపీలను మార్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
Go Back to Shorts
Narendra Modi
Survey
Namo App
BJP
Congress

More Telugu News